రూ. 25 లక్షల విలువైన ఫోన్లు చోరీ | rs.25 lakh worth mobiles robbery in tirupati | Sakshi
Sakshi News home page

రూ. 25 లక్షల విలువైన ఫోన్లు చోరీ

Oct 27 2016 1:15 PM | Updated on Sep 4 2017 6:29 PM

నగరంలోని ఎంఆర్‌పల్లిలో ఉన్న ఓ మొబైల్ దుకాణంలో చోరీ జరిగింది.

తిరుపతి క్రైం: నగరంలోని ఎంఆర్‌పల్లిలో ఉన్న ఓ మొబైల్ దుకాణంలో చోరీ  జరిగింది. దుకాణం షట్టర్ పగలగొట్టిన దుండగులు షాపులోని 52 సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లారు. సుమారు రూ. 25 లక్షల విలువైన ఫోన్లను తస్కరించినట్లు అంచనా. ఉదయం దుకాణం యజమాని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాల కోసం సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement