కలాం పార్టీని నిషేధించండి | Request Raised to Ban Party in name of Abudul kalam | Sakshi
Sakshi News home page

కలాం పార్టీని నిషేధించండి

Mar 4 2016 8:58 AM | Updated on Sep 3 2017 7:00 PM

మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం పేరిట ప్రారంభించిన పార్టీకి నిషేధం విధించాలంటూ రాష్ట్రపతికి సమూగ సేవై ఇల్లం (సామాజిక సేవా కేంద్రం) ఒక లేఖ రాసింది.

రాష్ట్రపతికి సమూగ సేవై ఇల్లం లేఖ
 
టీనగర్ : మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం పేరిట ప్రారంభించిన పార్టీకి నిషేధం విధించాలంటూ రాష్ట్రపతికి సమూగ సేవై ఇల్లం (సామాజిక సేవా కేంద్రం) ఒక లేఖ రాసింది.  చెన్నిమలైకు చెందిన సామాజిక సేవకుడు చొక్కలింగం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖలో ఈ విధంగా తెలిపారు.

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట ‘అబ్దుల్ కలాం లక్ష్య ఇందియ కట్చి’ అనే కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించారని తెలిపారు. అబ్దుల్ కలాం అత్యుత్తమ శాస్త్రవేత్తని, ఉత్తమ భారత పౌరుడిగా, దేశభక్తిగల నాయకుడిగా ఖ్యాతి చెందారన్నారని పేర్కొన్నారు.  కోట్లాది మంది ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారని తెలిపారు.

ఆయన ఉత్తమ మానవతాది మాత్రమేనని రాజకీయవేత్త కాదన్నారని పేర్కొన్నారు. అందువల్ల ఆయన పేరుతో పార్టీ ప్రారంభించడం అనవసరమని, దీనిపై పూర్తి విచారణ జరిపి ఆ పార్టీని నిషేధించాలని కోరుతున్నట్లు తెలిపారు. అబ్దుల్ కలాం పేరు ప్రతిష్టలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా కాపాడాలని, దీనిగురించి భారత ఎన్నికల కమిషన్‌కు ఒక పిటిషన్ పంపినట్లు తెలిపారు.

Advertisement

పోల్

Advertisement