సినీ ఫక్కీలో స్మగ్లర్ల అరెస్టు | police smoke out smuggler of marijuana | Sakshi
Sakshi News home page

సినీ ఫక్కీలో స్మగ్లర్ల అరెస్టు

Sep 26 2016 10:24 AM | Updated on Sep 4 2017 3:05 PM

గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు సినీ ఫక్కీలో పట్టుకున్నారు.

- గంజాయి తరలిస్తున్న కారును ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
గొల్లప్రోలు(తూర్పుగోదావరి)

ఓ కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ కారును ఆపడానికి యత్నించగా.. అందులో ఉన్న దుండగులు పోలీసుల కన్నుకప్పి పరారయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించడంతో.. కొద్ది దూరంలో కారు(Ts 7873) వదిలేసి నిందితులు పరారయ్యారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండల పరిధిలోని 16 వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఓ కారులో గంజాయి స్మగుల్ చేస్తున్నారని సమాచారం వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. అక్రమంగా గంజాయి తరలిస్తున్న వారు అక్కడినుంచి తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాహనాన్ని వెంబడించగా.. కొద్ది దూరంలో కారును వదిలి నిందితులు పరారయ్యారు. కారులో లభించిన 89 ప్యాకెట్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement