
సాక్షి, తుమకూరు: పేకాట ఆడటం నేరమని తెలిసినా ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే పేకాట ఆడిన నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. తాలూకాలోని గ్రామీణ నియోజకవర్గంలోని హెబ్బూరు పోలీస్ స్టేషన్‌లో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు... పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్‌ఐ రామచంద్రప్ప, కానిస్టేబుళ్లు మహేశ్, చెలువరాజు, సంతోష్‌లు పేకాట ఆడుకుంటూ గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని గాయపరచుకుని ఆస్పత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న ఎస్‌పీ కోన వంశీ కృష్ణ నలుగురిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏకంగా స్టేషన్‌లోనే పేకాట ఆడటాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని విచారణ జరుపుతున్నారు.
చదవండి: అనుకున్నట్లే ఏకగ్రీవం