పగలు పార్టీ పని.. రాత్రి పేకాట | manikyapalli srinu (pekata srinu) arrested by police | Sakshi
Sakshi News home page

పగలు పార్టీ పని.. రాత్రి పేకాట

Oct 2 2016 1:07 PM | Updated on Sep 4 2017 3:55 PM

పగలు పార్టీ పని..  రాత్రి పేకాట

పగలు పార్టీ పని.. రాత్రి పేకాట

పేకాట శిబిరం నిర్వహిస్తున్న టీడీపీ నేత, గ్రామ ఉప సర్పంచిని పోలీసులు అరెస్ట్ చేశారు.

  • అడ్డంగా దొరికిన తాడిగడప ఉప సర్పంచ్ శ్రీనివాసరావు
  • మరో 17 మంది అరెస్టు
  • రూ. 4.62 లక్షల స్వాధీనం
  • చంద్రబాబు ఫోటోతో ఆ నేత హల్‌చల్
  •  
    పెనమలూరు:  తాడిగడప గ్రామంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్న తాడిగడప టీడీపీ అధ్యక్షుడు, గ్రామ ఉప సర్పంచి మాణిక్యపల్లి శ్రీనివాసరావు (పేకాట శ్రీను) పోలీసుల వలకు చిక్కాడు. పోలీసు దాడుల్లో టీడీపీ నేతతో పాటు మరో 17 మంది పేకాడుతూ పట్టుపడగా,వారి వద్ద రూ. 4.62 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

    మాణిక్యపల్లి శ్రీనివాసరావు పై పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటు ఉంది. అతని పనే పేకాట శిబిరాలు నిర్వహించడని ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలో శుక్రవారం రాత్రి టీడీపీ నేత మేడసాని తాతేశ్వరరావు ఇంట్లో రాత్రి పేకాట ఆడుతున్న సమాచారం సెంట్రల్ ఏసీపీ సత్యానందంకు తెలిసి ఆయన అత్యంత గోప్యంగా పటమట సీఐ కెనడీ, పెనమలూరు సీఐ మామోదర్‌లతో కలిసి ఇంటిపై దాడి చేశారు. నిందితులను పెనమలూరు పీఎస్‌కు తరలించారు.
     
    పగలు పార్టీ పని..  రాత్రి పేకాట
    టీడీపీ నేత శ్రీనివాసరావు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఫోటో కూడా దిగారు. వాటితో ఫ్లెక్సీలు వేయిస్తున్నారు. అలాగే ఎంపీ కొనకళ్ల నారాయణకు సన్మానం చేశాడు. పగటి పూట పార్టీ పనులు, రాత్రి పేకాట శిబిరాల్లో బిజీగా ఉంటాడని చెబుతున్నారు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బోడెప్రసాద్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో అధికారంలో లేనప్పుడు పలు కేసుల్లో ఇతనిపై పోలీసులు రౌడీషీటు కూడా తెరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement