ఆసీఫాబాద్ జిల్లా నెన్నెల మండల కేంద్రంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది.
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
Nov 1 2016 2:46 PM | Updated on Sep 4 2017 6:53 PM
ఆసీఫాబాద్: ఆసీఫాబాద్ జిల్లా నెన్నెల మండల కేంద్రంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్థాపం చెందిన ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియుడు అశోక్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా గమనించిన కుటుంబసభ్యులు అతణ్ణి ఆస్పత్రికి తరలించారు. ప్రియురాలు స్వరూప బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు ఆమెను వెంటనే కాపాడారు. ప్రస్తుతం ఇద్దరూ కోలుకుంటున్నారు.
Advertisement
Advertisement