పెళ్లి చేసుకున్న టిక్‌టాక్‌ జోడీ  | Karnataka Tik Tok Duo Get Married | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకున్న టిక్‌టాక్‌ జోడీ 

Nov 10 2019 8:48 AM | Updated on Nov 10 2019 9:07 AM

Karnataka Tik Tok Duo Get Married - Sakshi

టిక్‌టాక్‌ ద్వారా పేరు తెచ్చుకున్న ఓ జోడి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది. 

యశవంతపుర: టిక్‌టాక్‌ ద్వారా పేరు తెచ్చుకున్న ఓ జోడి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది. టిక్‌టాక్‌ చేస్తూ పాపులర్‌ అయిన అల్లు రఘు, సుష్మితా శేషగిరి ఒక్కటయ్యారు. ఈ జోడి చేసిన టిక్‌టాక్‌ వీడియోలకు సామాజిక మాధ్యమాలలో మంచి పేరుంది. గురువారం వీరి వివాహం బెంగళూరులో వైభవంగా జరిగింది. ఇక నటుడు ధ్రువసర్జా వీరాభిమాని అయిన రఘు ఆయనను అనుకరించి చేసిన పలు టిక్‌టాక్‌ వీడియోలు భారీ వ్యూస్‌ సాధించాయి. రఘు ఆహ్వానం మేరకు టిక్‌టాక్‌ జోడి వివాహ కార్యక్రమానికి హాజరైన ధ్రువసర్జా  దంపతులను ఆశీర్వదించారు. టిక్‌టాక్‌లో దూసుకుపోతున్నారంటూ అభినందించారు. పెద్ద సంఖ్యలో ఉన్న రఘు, సుష్మితా ఫాలోవర్స్‌ శుభాకాంక్షలతో హోరెత్తించారు. రఘు బుల్లి తెరతో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.
(చదవండి : ‘టిక్‌టాక్‌’ విశేషాలెన్నో!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement