జయలలిత ప్రధానమంత్రి కా వాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నాడీఎంకే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిధి ఇళంవయది అన్నారు.
జయలలితను ప్రధాని కావాలనుకుంటున్నారు
Sep 22 2013 4:05 AM | Updated on Sep 1 2017 10:55 PM
వేలూరు, న్యూస్‌లైన్:జయలలిత ప్రధానమంత్రి కా వాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నాడీఎంకే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిధి ఇళంవయది అన్నారు. కాట్పాడి సమీపంలోని విరుదంబట్టులో కౌన్సిర ల్ నిత్యకుమార్ ఆధ్వర్యంలో పెరియా ర్, అన్నా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు అమ్మ ప్రభుత్వాన్ని మాత్రమే కోరకుంటున్నారన్నారు. సీఎం ప్రవేశ పెట్టిన పథకాలను చూసి అంతర్జాతీ య దినపత్రికలు కూడా అభినందిస్తున్నాయన్నారు. ఇండియాలో ఇందిరాగాంధీ తర్వాత మంచి పాలనను అందిస్తున్న ఒకే ఒక్క మహిళ జయలలితేనన్నారు.
రాష్ట్రంలో అనేక సమస్యలను పరిష్కరిస్తున్న ఘనత తమ ప్రభుత్వాని కే దక్కుతుందన్నారు. కచ్చదీవులు, మ త్య్సకారుల సమస్యలను పరిష్కరించారన్నారు. ప్రతి రోజూ ఒక సంచలనమైన పథకాలను ప్రవేశ పెడుతూ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా ఆశ్చర్యపరుస్తున్న అమ్మ ప్రభుత్వానికి సాటి రారన్నారు. రాష్ట్రంలోన్ని 40 పార్లమెంట్ స్థా నాలను కైవసం చేసుకొని అమ్మను ప్రధాన మంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్క రూ ఇప్పటి నుంచే కంకణం కట్టుకోవాలన్నారు. ఈ సమావేశంలో మేయ ర్ కార్తియాయిని, జిల్లా కార్యదర్శి ఎస్‌ఆర్‌కే అప్పు, మాజీ కార్యదర్శులు విల్వనాథన్, ఎల్‌కే ఎండి వాసు, ఎంజీఆర్ మండ్ర కార్యదర్శి నారాయణన్, కన్నియంబాడి యూనియన్ కార్యదర్శి రాఘవన్, కాట్పాడి యూనియన్ కార్యదర్శి కోరందాంగల్ కుమార్, అన్నాడీఎంకే నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement