హజ్ యాత్రకు వెళ్లే వారంతా సమాజానికి మార్గదర్శకులని, వారిని సమాజం గౌరవిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత అల్లం వీరభద్రప్ప, సిటీ ఎమ్మెల్యే అనిల్‌లాడ్ అా్నరు.
బళ్లారి టౌన్, న్యూస్‌లైన్ : హజ్ యాత్రకు వెళ్లే వారంతా సమాజానికి మార్గదర్శకులని, వారిని సమాజం గౌరవిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత అల్లం వీరభద్రప్ప, సిటీ ఎమ్మెల్యే అనిల్‌లాడ్ అన్నారు. ఆదివారం స్థానిక దొడ్డన గౌడ రంగ మందిరంలో హజ్ రాష్ట్ర, జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హజ్ యాత్రకుల శిక్షణ తరగతుల్లో వారు అతిథులుగా పాల్గొని మాట్లాడారు. 12 ఏళ్లుగా హజ్ కమిటీ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం శ్లాఘనీయమన్నారు.
హజ్‌కు వెళ్లి వచ్చిన వారంతా నిత్యం సత్యం పలుకుతుంటారనే భావన సమాజంలో ఉందన్నారు. యాత్రకు వెళ్లే వారికి ఇలాంటి శిక్షణ తరగతులు అత్యవసరమన్నారు. ముస్లింల మాదిరిగా హిందువులు కూడా వృద్ధాప్యంలో కాశీయాత్ర చేస్తుంటారని గుర్తు చేశారు. కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే బీ.శ్రీరాములు, మాజీ బుడా చైర్మన్ గురు లింగనగౌడ, హజ్ స్టేట్ కమిటీ చైర్మన్ లత్తీరసాబ్, నాసీరుస్సేన్, గౌస్ దాదాపీర్, దాదాసాబ్, హుమాయాన్ ఖాన్, అబ్దుల్ అజీజ్, రఫిక్ అహ్మద్, నూర్‌బాషా, కణేకల్లు మాబూసాబ్, రిజ్వాన్‌సాబ్ తదితరులు పాల్గొన్నారు.