విశాఖ జిల్లాలో నిషేధిత గుట్కా పెద్ద మొత్తంలో బయట పడింది.
విశాఖలో భారీగా గుట్కా పట్టివేత
Dec 7 2016 3:01 PM | Updated on Sep 19 2019 2:50 PM
విశాఖపట్టణం: విశాఖ జిల్లాలో నిషేధిత గుట్కా పెద్ద మొత్తంలో బయట పడింది. విశ్వసనీయ సమాచారం మేరకు పెందుర్తి పోలీసులు మంగళవారం అర్థరాత్రి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వైపు వెళ్తున్న కంటెయినర్‌ను తనిఖీ చేయగా 43 బస్తాల్లో ఉన్న గుట్కా ప్యాకెట్లు బయటపడ్డాయి. వీటి విలువ రూ.15 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Advertisement


