మాకూ ఓ అవకాశమివ్వండి | give me a chance | Sakshi
Sakshi News home page

మాకూ ఓ అవకాశమివ్వండి

Mar 29 2014 10:53 PM | Updated on Oct 29 2018 8:16 PM

స్వాతంత్రం లభించి 65 ఏళ్లు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ కొంతమంది ప్రజలకు కనీస సదుపాయాలు అందుబాటులో లేవని ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే సతీమణి షర్మిలాఠాక్రే విచారం వ్యక్తం చేశారు.

భివండీ, న్యూస్‌లైన్: స్వాతంత్రం లభించి 65 ఏళ్లు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ కొంతమంది ప్రజలకు కనీస సదుపాయాలు అందుబాటులో లేవని ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే సతీమణి షర్మిలాఠాక్రే విచారం వ్యక్తం చేశారు. ఈ కారణంగా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. స్థానిక శివాజీ చౌక్ వద్ద శుక్రవారం సాయంత్రం  పార్టీ ఎన్నికల కార్యాలయ ప్రారంభించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీకి ఓసారి అవకాశమివ్వాలని ఆమె ఓటర్లను కోరారు.
 
తాను ఇకమీదట రోడ్ షోలతోపాటుఇంటింటి ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటానన్నారు. తమ పార్టీ అభ్యర్థులు  తప్పని సరిగా గెలుపొందుతారంటూ ధీమా వ్యక్తం చేశారు. కాగా పార్టీ అభ్యర్థి సురేష్ గోపీనాథ్ మాత్రే (బాల్యామామా) కార్యాలయ ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో భివండీ లోక్‌సభ  నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యే ప్రకాశ్ బోయిర్, ఎమ్మెన్నెస్ ప్రదేశ్ ఉపాధ్యక్షుడు డి.కే.మాత్రే, మహిళా సేనా ప్రదేశ్ అధ్యక్షుడు రీటా గుప్తా, కాకా మాండలే, భారత్ పాటిల్, దశరథ్ పాటిల్, మదన్ పాటిల్, ఊర్మిళా తాంబేలతోపాటు వేలాదిమంది కార్యకర్తలు, నాయకులు ద్విచక్రవాహనలపై రోడ్‌షోలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement