 
															ఆగిన పెళ్లి
తాళి కట్టే సమయానికి వధువు వివాహానికి తిరస్కరించడంతో పెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటన
	తిరువొత్తియూరు: తాళి కట్టే సమయానికి వధువు వివాహానికి తిరస్కరించడంతో పెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటన తిరుపోరూరులో చోటుచేసుకుంది. కేళంబాక్కం, మాంబాకంకు చెందిన వనిత. ఈమెకు నావలూర్ సమీపంలో ఉన్న తాళంపూరుకు చెందిన ప్రభుత్వ బస్సు కండక్టర్‌తో ఆదివారం వివాహం జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం సాయంత్రం తిరుపోరూరు నార్త్ మాడ వీధిలో ఉన్న వివాహ మండపంలో వధువు ఆహ్వాన కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో వనిత తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిపింది.
	 
	 ఈ మాటలను ఆమె తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ముహూర్త సమయం దగ్గరపడుతున్న సమయంలో పెళ్లి పీఠలపై వరుడు కూర్చొని ఉన్నాడు. వధువును తీసుకుని రావడానికి బంధువులు, స్నేహితులు పెళ్లి కుమార్తె గదికి వెళ్లారు. కాని అక్కడ నుంచి పెండ్లి పీఠలపైకి వచ్చి కూర్చోవడానికి వనిత తిరస్కరించింది. తనకు వివాహం వద్దని ఏడ్చింది. ఈ సంగతి తెలుసుకున్న పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు, బంధువులు వనితతో రెండు గంటలు సమయం మాట్లాడి సమాధానం చేసినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వివాహానికి చేసిన ఖర్చు మొత్తం ఇవ్వడానికి  వధువు పెద్దలు అంగీకరించారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
