వారసురాలితో నటించనున్న మరో హీరో | Arjun's Daughter Aishwarya in Vishal's Pattathu Yanai | Sakshi
Sakshi News home page

వారసురాలితో నటించనున్న మరో హీరో

Feb 12 2016 2:27 AM | Updated on Sep 3 2017 5:26 PM

వారసురాలితో నటించనున్న మరో హీరో

వారసురాలితో నటించనున్న మరో హీరో

హీరోలు తమ వారసులతో కలిసి నటించడం అన్నది అరుదైన విషయమే అనాలి.అలా విశ్వనటుడు కమలహాసన్ తన వారసురాలు,

హీరోలు తమ వారసులతో కలిసి నటించడం అన్నది అరుదైన విషయమే అనాలి.అలా విశ్వనటుడు కమలహాసన్ తన వారసురాలు, నేటి క్రేజీ హీరోయిన్ శ్రుతిహాసన్‌తో కలిసి నటించడానికి సిద్ధమవుతున్నారు. వీరిద్దరిని కలిపి చిత్రం చేయాలన్న ప్రయత్నాలు చాలా కాలంగాను జరుగుతున్నాయి. కమలహాసన్‌నే తన చిత్రంలో శ్రుతిని నటించమని ఇదివరకే అడిగారు.అయితే ఆమె కాల్‌షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ చిత్రంలో నటించలేనని చె ప్పారు.
 
  తాజాగా కమలహసన్, శ్రుతిహసన్‌లను వెడి తెరపైనా తండ్రీ కూతుళ్లుగా చూడబోతున్నాం.ఈ క్రేజీ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. నటుడు అర్జున్ కూడా తన వారసురాలితో నటించడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. అర్జున్ కూతురు ఐశ్వర్య నటుడు విశాల్‌కు జంటగా పట్టత్తుయానై చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమయ్యారు.
 
  అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోవడం వల్లో లేక మరే కారణంతోనో ఐశ్వర్యకు ఆ తరువాత అవకాశాలు రాలేదు. అర్జున్ ప్రస్తుతం ఓరు మెల్లియ కోడు, నిపుణన్ చిత్రాల్లో నటిస్తున్నారు.తదుపరి తన స్వీయ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఆయన వారసురాలు ఐశ్వర్య కూడా ముఖ్య పాత్రను పోషించనున్నారట.ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement