గదిలో చిరుత.. బాత్‌రూమ్‌లో అత్తా కోడళ్లు

After high drama, leopard captured from house in Tumakuru town - Sakshi

మత్తు ఇంజక్షన్‌తో చిరుతను బంధించిన అటవీ సిబ్బంది

సాక్షి, తుమకూరు: కర్ణాటకలోని తుమకూరు జిల్లా కేంద్రంలో ఓ చిరుత జనాలను హడలెత్తించింది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో రంగనాథ్‌ అనే వ్యక్తి ఇంట్లోకి చిరుత ప్రవేశించి తిష్టవేసింది. కుటుంబ సభ్యులందరూ బయటకు పరుగులు తీయగా అత్త వనజాక్షి,, కోడలు వినూత బాత్‌రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకొని ప్రాణ భయంతో గడిపారు.

ఎమ్మెల్యే రఫిక్‌ అహ్మద్, జిల్లా కలెక్టర్‌ కేపీ మోహన్‌రాజు, ఎస్పీ గోపీనాథ్‌దివ్య అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పోలీసు, అటవీ సిబ్బందితో ఇంటి గోడ పగుల గొట్టి ఆ ఇద్దరినీ బయటకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటల వరకు చిరుతను బంధించేందుకు విశ్వప్రయత్నం చేశారు. బెంగళూరులోని బన్నేరుఘట్ట ఉద్యానవనం నుంచి మత్తుమందు ఇచ్చే నిపుణుడిని రప్పించి చిరుతకు మత్తు మందు ఇంజక్షన్‌ వేసి బంధించి అటవీ ప్రాంతానికి తరలించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top