ఏరో ఇండియా-15 ప్రదర్శనలో మూడో రోజైన శుక్రవారం మళ్లీ అపశ్రుతి చోటు చేసుకుంది.
ఏరో ఇండియా-15 ప్రదర్శనలో మూడో రోజైన శుక్రవారం మళ్లీ అపశ్రుతి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ప్రదర్శన సమయంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగతాగడాన్ని నిషేధించారు. దీంతో గేట్ 8, 9 నుంచి ప్రదర్శనకు వచ్చే వారిలో లోపలకు వస్తూ వెలిగించిన సిగరెట్‌ను అక్కడే పడేశారు. అక్కడి నేలపై ఉన్న ఎండు గండికి మంటలు వ్యాపించి, దట్టంగా పొగలు అలుముకున్నాయి.
దీంతో తక్షణమే అక్కడకు చేరుకున్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సివ్ ఫోర్స్(ఎన్‌డీఆర్‌ఎఫ్) సభ్యులు మంటలను ఆర్పివేశారు. ఇక ఈ రెండు గేట్‌లు రన్‌వేకి చాలా దగ్గరగా ఉండడం వల్ల మంటలు కనుక మరింత వేగంగా వ్యాపించి ఉంటే పెనుప్రమాదమే సంభవించి ఉండేదని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
- సాక్షి, బెంగళూరు