మరోసారి క్రికెట్‌ ఫీల్డ్‌లోకి జహీర్‌ | Zaheer Khan, Praveen Kumar to feature in T10 League | Sakshi
Sakshi News home page

మరోసారి క్రికెట్‌ ఫీల్డ్‌లోకి జహీర్‌

Oct 23 2018 9:28 AM | Updated on Oct 23 2018 11:18 AM

Zaheer Khan, Praveen Kumar to feature in T10 League - Sakshi

న్యూఢిల్లీ: ఒకప్పటి భారత క్రికెట్‌ జట్టు ప‍్రధాన పేసర్‌ జహీర్‌ ఖాన్‌ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. వచ్చే నెలలో షార్జాలో ఆరంభం కానున్న టీ10 లీగ్‌లో జహీర్‌ఖాన్‌ ఆడనున్నాడు. ఈ టోర్నీ నవంబర్‌ 23 నుంచి ఆరంభం కానుంది.

తొలి ఎడిషన్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ లీగ్‌లో భారత్‌ నుంచి అప్పుడు ఒక్కడే ఆడగా ఈసారి మాత్రం పలువురు భాగస్వామ్యం అవుతున్నారు. జహీర్‌ ఖాన్‌, ప్రవీణ్‌ కుమార్‌, ఆర్పీ సింగ్‌, ఆర్‌ఎస్‌ సోధి, సుబ్రమణ్యం బద్రీనాథ్‌తో పాటు మరో ముగ్గురు ఆడనున్నారు. ‘టీ10 రెండో ఎడిషన్‌లో హై ప్రొఫైల్‌ కల్గిన ఎనిమిది మంది భారత క్రికెటర్లు ఆడటం చాలా సంతోషకరం. రానున్న కాలంలో ఈ లీగ్‌లో దేశవిదేశాలకు చెందిన ఎక్కువ ఆటగాళ్లను ఆకర్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది’ అని లీగ్‌ ఛైర్మన్‌ షాజీ ఉల్‌ ముల్క్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement