
ఢిల్లీ: బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తుననానని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణకుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. పోలీస్ అధికారిగా ఉండి, తన తోటి పోలీసు చేస్తున్న విధులను కించపరిచేలా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని విమర్శించారు.
‘గత ప్రభుత్వంలో డ్రగ్ కేసులు కాలేదు, విచ్చల విడిగా డ్రగ్స్ ఉపయోగించారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు బీఎస్పీ నేతగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడింది మర్చి పోయారా?, అప్పట్లో డ్రగ్స్ స్వేచ్చగా దొరుకుతున్నాయంటూ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఇపుడు పార్టీ మారాక బిఆర్ఎస్ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకే ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్స్ చేస్తున్నారు. సీఎంగా రేవంత్ బాధ్యత తీసుకున్నాక, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపారు. మీరు యదేచ్చగా వదిలి పెట్టిన వాళ్లపై కేసులు పెడుతున్నాం. తెలంగాణ ప్రజలను ప్రవీణ్ కుమార్ తప్పు దోవ పట్టిస్తున్నారు’ అని మండిపడ్డారు.