మ్యాక్స్‌వెల్‌.. వెరీవెల్‌ | Sakshi
Sakshi News home page

మ్యాక్స్‌వెల్‌.. వెరీవెల్‌

Published Tue, Jun 25 2019 11:46 PM

World Cup 2019 Maxwell Brilliant To Dismiss Woakes - Sakshi

లండన్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ స్టన్నింగ్‌ ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. ఆసీస్‌ బౌలర్‌ బెహ్రాన్‌డార్ఫ్‌ వేసిన 42వ ఓవర్‌ రెండో బంతిని క్రిస్‌వోక్స్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ వైపు భారీ షాట్‌ ఆడాడు. వోక్స్‌తో సహా అందరూ అది సిక్సర్ అని ఫిక్స్‌ అయ్యారు. కానీ అక్కడ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న మ్యాక్స్‌వెల్‌ సిక్సర్‌ వెళ్లే బంతిని గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. 

అయితే బ్యాలెన్స్‌ కోల్పోయిన మ్యాక్సీ బౌండరీ హద్దును తాకబోతున్నట్లు గమనించి అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న ఆరోన్‌ ఫించ్‌ వైపు బంతిని విసిరేశాడు. వెంటనే అప్రమత్తమైన ఫించ్‌ దాన్ని రెండు చేతులా అందిపుచ్చుకోవడంతో వోక్స్‌ నిరాశగా వెనుదిరిగాడు. మ్యాక్స్‌వెల్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో ఆసీస్‌తో పాటు ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక మెరుపు ఫీల్డింగ్‌తో పాటు మ్యాక్స్‌వెల్‌ చాకచక్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మ్యాక్స్‌వెల్‌.. నువ్‌ వెరీవెల్‌..! అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయఢంకా మోగించింది.


Advertisement
 
Advertisement
 
Advertisement