ఆండ్రీ రసెల్‌ ఔట్‌

West Indies opt to bowl, Russell out injured - Sakshi

సౌతాంప్టన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా ఇప్పటిదాకా బోణీ కొట్టలేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం కాకుండా ఉండాలంటే వెస్టిండీస్‌పై గెలవడం సఫారీలకు తప్పనిసరి. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌ గెలిచి.. మరో మ్యాచ్‌లో ఓడిన విండీస్‌.. దక్షిణాఫ్రికాపై గెలవాలనే పట్టుదలతో ఉంది.‌ ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన విండీస్‌ కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌.. సఫారీలను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఈ మ్యాచ్‌కు విండీస్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ దూరమయ్యాడు. గాయం కారణంగా రసెల్‌ మ్యాచ్‌ నుంచి వైదొలిగాడు. ఇక ముఖాముఖి పోరులో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లు 61 వన్డేలు ఆడగా, ఇందులో సఫారీ జట్టు 44 గెలిచి, విండీస్‌ 15 మాత్రమే నెగ్గింది. ఒక మ్యాచ్‌ టై అయ్యింది. మరో మ్యాచ్‌ రద్దయ్యింది. గత మూడు కప్‌లలోనూ వారిపై విజయం సాధించింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారైంది. సెమీస్‌ రేసులో నిలవాలంటే దక్షిణాఫ్రికా తప్పక గెలవాల్సి ఉండగా, కరీబియన్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇరు జట్లు ఇప్పటివరకు ప్రపంచ కప్‌లో ఆరు మ్యాచ్‌ల్లో తలపడితే... నాలుగింటిలో సఫారీలు, రెండింటిలో వెస్టిండీస్‌ గెలిచింది.

దక్షిణాఫ్రికా
డుప్లెసిస్‌(కెప్టెన్‌), హషీమ్‌ ఆమ్లా, డీకాక్‌, మర్కరమ్‌, వాన్‌ డెర్‌ డస్సెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, ఫెహ్లుక్వోయో, క్రిస్‌ మోరిస్‌, కగిసో రబడా, ఇమ్రాన్‌ తాహీర్‌, హెండ్రిక్స్‌

వెస్టిండీస్‌
జాసన్‌ హోల్డర్‌(కెప్టెన్‌), క్రిస్‌ గేల్‌, షాయ్‌ హోప్‌, డారెన్‌ బ్రేవో, నికోలస్‌ పూరన్‌, హెట్‌ మెయిర్‌, బ్రాత్‌వైట్‌, ఆశ్లే నర్స్‌, కీమర్‌ రోచ్‌, షెల్డాన్‌ కాట్రెల్‌, ఓష్నే థామస్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top