బిషూ 'సిక్సర్'... వోజెస్ సెంచరీ | Voges debut century puts Australia in command | Sakshi
Sakshi News home page

బిషూ 'సిక్సర్'... వోజెస్ సెంచరీ

Jun 5 2015 12:56 PM | Updated on Sep 3 2017 3:16 AM

బిషూ 'సిక్సర్'... వోజెస్ సెంచరీ

బిషూ 'సిక్సర్'... వోజెస్ సెంచరీ

వెస్టిండీస్ తో జరుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 318 పరుగులు చేసింది.

రోసీయూ: వెస్టిండీస్ తో జరుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 318 పరుగులు చేసింది. ఆడమ్ వోజెస్ తొలి టెస్టు సెంచరీతో ఆసీస్ కు ఆధిక్యం దక్కింది. 178 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను వోజెస్ అజేయ శతకంతో గట్టెక్కించాడు. చివరి రెండు వికెట్ కు అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. హాజిల్ వుడ్ తో కలిసి పదో వికెట్ కు 97 పరుగులు జోడించాడు. హాజిల్ వుడ్ 39 పరుగులు చేసి చివరి వికెట్ గా అవుటయ్యాడు.

తొలి టెస్టు ఆడుతున్న వోజెస్ పట్టుదలగా ఆడి శతకం నమోదు చేశారు. 247 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ తో 130 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో స్పిన్నర్ దేవేంద్ర బిషూ (6/80) కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement