'మరోసారి అతనితో మ్యాచ్ నిర్వహించండి' | Vladimir Klitschko wants heavyweight rematch with Tyson Fury | Sakshi
Sakshi News home page

'మరోసారి అతనితో మ్యాచ్ నిర్వహించండి'

Dec 3 2015 1:34 PM | Updated on Sep 3 2017 1:26 PM

'మరోసారి అతనితో మ్యాచ్ నిర్వహించండి'

'మరోసారి అతనితో మ్యాచ్ నిర్వహించండి'

వ్లాదిమిర్ క్లిచ్ కో.. అతను తిరుగులేని బాక్సింగ్ చాంపియన్. 2004 నుంచి ఓటమి అనేది ఎరుగకుండా డబ్యూబీఏ, ఐబీఎఫ్, ఐబీవో, డబ్యూబీవో వంటి టైటిల్స్ ను..

బెర్లిన్: వ్లాదిమిర్ క్లిచ్ కో.. అతను తిరుగులేని బాక్సింగ్ చాంపియన్. 2004 నుంచి ఓటమి అనేది ఎరుగకుండా డబ్యూబీఏ, ఐబీఎఫ్, ఐబీవో, డబ్యూబీవో వంటి  టైటిల్స్ ను తన ఖాతాలో వేసుకుని అప్రతిహత జైత్రయాత్ర సాగిస్తున్న వ్లాదిమిర్(ఉక్రెయిన్)కు ఇటీవల టైసన్ ఫ్యూరీ(బ్రిటన్)చెక్ పెట్టాడు. గత శనివారం డ్యూసెలదార్ఫ్ లో వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో వ్లాదిమిర్ ను ఓడించిన ఫ్యూరీ సరికొత్త చరిత్రను సృష్టించాడు. కాగా, మరోసారి అతనితో మ్యాచ్   నిర్వహిస్తే తన సత్తాను చాటుతానంటున్నాడు వ్లాదిమిర్. టైసన్ ఫ్యూరీతో సాధ్యమైనంత త్వరలో రీ మ్యాచ్ నిర్వహించాలంటూ ఓ ప్రకటనలో కోరాడు.

 

'ఆ మ్యాచ్ లో ఓటమిని చవిచూశా. ఓటమి అనేది ఆప్షన్ కాదు. ఆరోజు మ్యాచ్ లో కొన్ని తప్పిదాల వల్ల ఓడిపోయా. అప్పటి మ్యాచ్ కంటే మరింత ఉన్నతమైన గేమ్ ను ఆడాలని కోరుకుంటున్నా. మరోసారి ఫ్యూరీతో ఆడితే సత్తా చూపిస్తా' అని వ్లాదిమిర్ తెలిపాడు. కాగా, వ్లాదిమిర్ తో మరోసారి మ్యాచ్ ను టైసన్ ఫ్యూరీ ట్రైనర్,  అంకుల్ పీటర్ ఫ్యూరీ స్వాగతించాడు. తాము కూడా అదే కోరుకుంటున్నామని పీటర్ స్పష్టం చేశాడు. ముందస్తు ఒప్పందం ప్రకారం ఆ ఇద్దరి బాక్సర్స్ మధ్య మరో మ్యాచ్ జరగాల్సి ఉంది. దీన్ని వచ్చే సంవత్సరం లండన్ లో నిర్వహించే అవకాశం ఉంది.

టైసన్ ఫ్యూరీ కొత్త చరిత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement