వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ టైసన్ ఫ్యూరీ(బ్రిటన్) చిక్కుల్లో పడ్డాడు.
మాంచెస్టర్: వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ టైసన్ ఫ్యూరీ(బ్రిటన్) చిక్కుల్లో పడ్డాడు. విద్వేష నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో అతడిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హోమోసెక్సువాలిటీ గురించి చేసిన వ్యాఖ్యలకు తోడు నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఫెడరేషన్(ఐబీఎఫ్) బెల్ట్ విప్పాడనన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
టైసన్ ఫ్యూరీపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టామని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు తెలిపారు. నవంబర్ 28న జరిగిన వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో వ్లాదిమిర్ (ఉక్రెయిన్)ను ఓడించి టైసన్ ప్యూరీ విజేతగా నిలిచాడు.