
సాక్షి, హైదరాబాద్: అనంత్ నారాయణ్ రెడ్డి, రామేశ్వరమ్మ స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో జీఎస్‌ఎం ప్లేయర్లు విధి జైన్, భవిత క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీలో ఆదివారం జరిగిన సబ్‌జూనియర్ బాలికల ప్రిక్వార్టర్స్‌లో విధి జైన్ 3–0తో ప్రగ్యాన్ష (వీపీజీ)పై, భవిత 3–0తో మానస (ఏడబ్ల్యూఏ)పై గెలుపొందారు. బాలుర కేటగిరీలో త్రిశూల్ మెహతా (ఎల్‌బీఎస్), రాజు (ఏడబ్ల్యూఏ), జతిన్ (ఎస్పీహెచ్‌ఎస్), కేశవన్ (ఎంఎల్‌ఆర్) క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. ప్రిక్వార్టర్స్‌లో త్రిశూల్ 3–0తో వరుణ్ (జీఎస్‌ఎం)పై, రాజు 3–0తో మహేశ్ (జీటీటీఏ)పై, జతిన్ దేవ్ 3–2తో వివేక్ సాయి (హెచ్‌వీఎస్)పై, కేశవన్ 3–0తో ఇశాంత్ (ఎస్పీహెచ్‌ఎస్)పై గెలుపొందారు.
క్యాడెట్ బాలికల విభాగంలో నిఖిత, గౌరి సెమీఫైనల్లో అడుగుపెట్టారు. క్వార్టర్స్ మ్యాచ్‌లో నిఖిత 3–0తో శ్రీవత్స (హెచ్‌వీఎస్)పై, గౌరి (జీటీటీఏ) 3–0తో సమీక్ష (జీఎస్‌ఎం)పై, ధ్రితి (జీటీటీఏ) 3–1తో సంహిత (హెచ్‌పీఎస్)పై, కావ్య (ఏడబ్ల్యూఏ) 3–1తో జలాని (వీపీజీ)పై గెలుపొందారు. బాలుర ప్రి క్వార్టర్స్‌లో జతిన్ (ఎస్పీహెచ్‌ఎస్) 3–0తో గౌతమ్ (నల్లగొండ)పై, మహేశ్ (జీటీటీఏ) 3–0తో అక్షయ్ (ఏడబ్ల్యూఏ)పై, శౌర్య రాజ్ (ఏవీఎస్‌సీ) 3–0తో క్రిష్ గ్రోవర్ (ఎన్‌సీసీ)పై, పార్థ్ భాటియా (ఏడబ్ల్యూఏ) 3–0తో దేవాన్‡్ష సింగ్ (ఎస్పీహెచ్‌ఎస్)పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరారు.