రాహుల్, వృశాలి శుభారంభం | Telangana players Rahul, vrushali | Sakshi
Sakshi News home page

రాహుల్, వృశాలి శుభారంభం

Feb 3 2015 1:00 AM | Updated on Sep 2 2017 8:41 PM

రాహుల్, వృశాలి శుభారంభం

రాహుల్, వృశాలి శుభారంభం

తెలంగాణ క్రీడాకారులు సి. రాహుల్ యాదవ్, జి. వృశాలి జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేశారు

జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్
సాక్షి, విజయవాడ: తెలంగాణ క్రీడాకారులు సి. రాహుల్ యాదవ్, జి. వృశాలి జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేశారు. ఇక్కడి డీఆర్‌ఎంసీ ఇండోర్ స్టేడియంలో సోమవారం వ్యక్తిగత విభాగంలో మెయిన్ డ్రా మ్యాచ్‌లను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో రాహుల్ 21-12, 21-12తో మనజీత్ సింగ్ (త్రిపుర)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు.

కిరణ్ కుమార్ (టీఎస్) 21-9, 13-21, 14-21తో ఆశిష్ శర్మ (ఢిల్లీ) చేతిలో పరాజయం చవిచూడగా... వికాస్ హర్ష (ఏపీ) 21-10, 21- 18తో కబీర్ కంజార్కర్ (మహారాష్ట్ర)పై, భార్గవ రెడ్డి (ఏపీ) 21-13, 21-15తో రాజు ఛెత్రి (నాగాలాండ్)పై గెలిచారు. మహిళల సింగిల్స్‌లో వృశాలి 21-14, 21-12తో రుతపర్ణ పండ (ఒరిస్సా)పై, ప్రాషి జోషి (టీఎస్) 21-7, 21-7తో జైసీ బ్రిడ్జెట్టి (పుదుచ్చేరి)పై గెలిచారు.

కె.వైష్ణవి (టీఎస్) 17-21, 21-3, 21-11తో ప్రతాన తాప (నాగాలాండ్)పై, పూర్ణిమ (ఏపీ) 21-15, 21-14తో నిషా (చండీగఢ్)పై, సాయి ఉత్తేజిత (ఏపీ) 21-10, 21-16తో సీమ (హరియాణా)పై విజయం సాధించారు. ఎయిరిండియాకు ఆడుతున్న తెలుగమ్మాయి హారిక 21-4, 21-8తో జూహి దేవాంగన్ (చండీగఢ్)పై గెలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement