ఆచితూచి ఆడుతున్న టీమిండియా | team india score 44/1 in 10 overs | Sakshi
Sakshi News home page

ఆచితూచి ఆడుతున్న టీమిండియా

Oct 14 2015 2:19 PM | Updated on Sep 3 2017 10:57 AM

టీమిండియా బ్యాట్స్మెన్లు ఆచితూడి ఆడుతున్నారు. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇండోర్లో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో కూడా భారత్ బ్యాట్స్మెన్స్ బ్యాట్ను వేగంగా కాకుండా ఆచితూచి ఝళిపిస్తున్నారు.

ఇండోర్: టీమిండియా బ్యాట్స్మెన్లు ఆచితూడి ఆడుతున్నారు. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇండోర్లో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో కూడా భారత్ బ్యాట్స్మెన్స్ బ్యాట్ను వేగంగా కాకుండా ఆచితూచి ఝళిపిస్తున్నారు. ఇప్పటికే టీ ట్వంటీలో, తొలి వన్డేలో ఓటమిని చవిచూసిన టీమిండియా రెండో వన్డేలో నిలకడగా ఆడాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

రెండో ఒవర్ నాలుగో బంతికే రోహిత్ శర్మ వికెట్ కోల్పోవడం కూడా ఇందుకు మరో కారణం. బుధవారంనాటి మ్యాచ్లో పది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 44/1గా ఉంది. ప్రస్తుతం క్రీజులో దవన్(14), రహానే(24) ఉన్నారు. రహానే కాస్త వేగంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ దక్షిణాఫ్రికా బౌలర్లు మాత్రం తీవ్రంగానే కట్టడిచేస్తున్నారు. అతి క్లిష్టంగా పరుగులు వస్తున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement