మయాంక్‌.. మొదలెట్టేశాడు! | Team India Practice Session Start For Test Against West indies | Sakshi
Sakshi News home page

Oct 3 2018 11:46 AM | Updated on Oct 3 2018 2:40 PM

Team India Practice Session Start For Test Against West indies - Sakshi

రాజ్‌కోట్‌: ఇంగ్లండ్‌ పర్యటనలో నిరాశ పెట్టిన టీమిండియా ఆటగాళ్లు.. ఆసియా కప్‌లో అదరగొట్టారు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరగబోయే సిరీస్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ముఖ్యంగా టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్న యువ ఆటగాళ్లు మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, మహ్మద్‌ సిరాజ్‌లపై అందరి దృష్టి ఉంది. ఈ సిరీస్‌తో ఓపెనింగ్‌ జోడీపై ఓ క్లారిటీ వస్తుందని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. రేపటి(గురువారం) నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం టీమిండియా ఆటగాళ్లు కసరత్తులు ప్రారంభించారు. ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను బీసీసీఐ తన అధికార ట్విటర్‌లో పోస్టు చేసింది.

ముఖ్యంగా యువ ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోతో పాటు ‘టీమిండియా నెట్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో మయాంక్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ మొదలెట్టేశాడు’ అంటూ ట్వీట్‌ పెట్టింది. ఇక తొలి టెస్టులో కేఎల్‌ రాహుల్‌తో పాటు మయాంక్‌, పృథ్వీ షాలలో ఒకరికి అవకాశం లభించనుంది. రెండు టెస్టుల్లో ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. విశ్రాంతి అనంతరం విరాట్‌ కోహ్లి జట్టుతో చేరి ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. వెస్టిండీస్‌తో భారత జట్టు రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. టెస్టుల్లో టీమిండియా నంబర్‌ వన్‌ ర్యాంక్‌లో ఉండగా, ఆతిథ్య విండీస్‌ జట్టు ఎనిమిదో ర్యాంక్‌లో కొనసాగుతోంది. 


 

చదవండి: ఈ నలు‘గురి’... 

ద్రవిడ్‌ సలహాతోనే ఆ ఛాన్స్‌ 

1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement