టౌఫెల్ ఆధ్వర్యంలో వర్క్‌షాప్ | Simon Taufel to Conduct Two Days work shop | Sakshi
Sakshi News home page

టౌఫెల్ ఆధ్వర్యంలో వర్క్‌షాప్

Apr 4 2015 12:48 AM | Updated on Sep 2 2017 11:48 PM

ఐపీఎల్-8 మ్యాచ్ అఫీషియల్స్ కోసం రెండు రోజుల పాటు వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ప్రఖ్యాత మాజీ అంపైర్ సైమన్ టౌఫెల్ ఆధ్వర్యంలో నేడు (శనివారం), రేపు ఈ సమావేశం జరుగుతుందని బీసీసీఐ తెలిపింది.

ముంబై: ఐపీఎల్-8 మ్యాచ్ అఫీషియల్స్ కోసం రెండు రోజుల పాటు వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ప్రఖ్యాత మాజీ అంపైర్ సైమన్ టౌఫెల్ ఆధ్వర్యంలో నేడు (శనివారం), రేపు ఈ సమావేశం జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. ఇందులో అంపైర్లు, రిఫరీలు కలిసి 26 మంది పాల్గొంటారని పేర్కొంది. దీంట్లో దుస్తుల నియంత్రణ, మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తనతో పాటు ఓవరాల్‌గామ్యాచ్‌లను నిర్వహించే విధానంపై చర్చించనున్నారు. ప్రస్తుతం ఐసీసీ అంపైర్ పనితీరు మరియు శిక్షణ అధికారిగా వ్యవహరిస్తున్న టౌఫెల్.. ప్రారంభ లీగ్ మ్యాచ్‌ల్లో అఫీషియల్స్ బృందంతో పాటు పర్యటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement