చరిత్ర సృష్టించిన 10 ఏళ్ల బాలుడు! | Shubham Jaglan created history by winning the Two Junior Golf Titles | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన 10 ఏళ్ల బాలుడు!

Jul 24 2015 8:46 AM | Updated on Sep 3 2017 6:06 AM

చరిత్ర సృష్టించిన 10 ఏళ్ల బాలుడు!

చరిత్ర సృష్టించిన 10 ఏళ్ల బాలుడు!

సంపన్నుల క్రీడగా చెలామణి అవుతున్న గోల్ఫ్ లో అతి సాధారణ కుటుంబానికి చెందిన బాలుడు సత్తా చాటాడు.

లాస్ వెగాస్: సంపన్నుల క్రీడగా చెలామణి అవుతున్న గోల్ఫ్ లో అతి సాధారణ కుటుంబానికి చెందిన బాలుడు సత్తా చాటాడు. భారత గోల్ఫ్ క్రీడాకారుడు శుభమ్ జగ్లాన్(10) క్రీడా ప్రపంచంలో చరిత్ర సృష్టించాడు. రెండు వారాల వ్యవధిలో రెండు ప్రపంచ టైటిళ్లు గెలిచి సత్తా చాటాడు.

అమెరికాలోని లాస్ వెగాస్ లో జరిగిన ఐజేజీఏ వరల్డ్స్ స్టార్స్ ఆఫ్ జూనియర్ గోల్ఫ్ ఈవెంట్ లో విజేతగా నిలిచి ఈ ఘనత సాధించాడు. అంతకుముందు కాలిఫోర్నియాలో జరిగిన వెలక్క్ రిసార్ట్ ఫౌంటెయిన్ కోర్స్ టోర్నిలోనూ విజయకేతనం ఎగురవేశాడు. హర్యానా గ్రామీణ ప్రాంతానికి చెందిన శుభమ్ జగ్లాన్ తండ్రి పాలు అమ్ముకుని జీవిస్తుంటాడు. ఒక సాధారణ కుటుంబానికి చెందిన శుభమ్ గోల్ఫ్ క్రీడలో రెండు వారాల్లోనే అరుదైన టైటిళ్లు సాధించడం విశేషం.

తన విజయాల పట్ల శుభమ్ సంతోషం వ్యక్తం చేశాడు. తనను అభినందిస్తుంటే గొప్పగా ఉందని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. నిజాయితీగా కష్టపడి ఈ విజయాలు సాధించానని, తనకు అడ్డదారులు లేవని పేర్కొన్నాడు. తన తండ్రి చాలా నిరాబండర జీవితం గడుపుతాడని వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement