షమీ కోసం ఎంతో చేశా, కానీ... | Shami Wife Hasin Jahan Returns to Modelling | Sakshi
Sakshi News home page

Jul 8 2018 1:13 PM | Updated on Jul 8 2018 4:14 PM

Shami Wife Hasin Jahan Returns to Modelling - Sakshi

లైంగిక ఆరోపణలు, గృహ హింస చట్టం కేసులతో భర్త షమీని ఉక్కిరి బిక్కిరి చేసిన హసీన్‌ జహాన్‌ మళ్లీ వార్తల్లో నిలిచారు. నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి ఆమె ప్రొఫెషనల్‌ ఫీల్డ్‌లోకి దిగిపోయారు. స్వతహాగా మోడల్‌ అయిన హసీన్‌.. కోల్‌కతాలో నిర్వహించిన ఓ ఫ్యాషన్‌ షోలో ర్యాంప్‌ వాక్‌తో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడారు. 
 
‘షమీ కోసం నా కెరీర్‌ను, ఇష్టాలను వదిలేసుకున్నా. నా కలల్ని చంపుకున్నా. కానీ, అతని నుంచి నాకేం ఒరగలేదు. పైగా ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలేశాడు. అందుకే నాకు గుర్తింపునిచ్చి.. తిండి పెట్టిన ఫీల్డ్‌లోకి తిరిగి వచ్చేశా. ప్రస్తుతం మోడలింగ్‌ కోసం కోల్‌కతాతోపాటు ముంబై, ఇతర నగరాల్లో అవకాశాలు వస్తున్నాయి’ అని జహాన్‌ తెలిపారు. మోడలింగ్‌ కోసం మొదట పాత పరిచస్తులకు, స్నేహితులకు ఫోన్‌ చేయాలంటే ఇబ్బందిగా అనిపించిందని, కానీ, కూతురి కెరీర్‌ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వారితో మాట్లాడి అవకాశాలు దక్కించుకున్నట్లు ఆమె తెలిపారు. తాను బయటకు వెళ్లినప్పుడు కూతురి బాగోలును తన తండ్రితోపాటు కూతురు(మొదటి భర్తతో కలిగిన సంతానం) చూసుకుంటున్నారని హసీన్‌ జహాన్‌ వెల్లడించారు. 

కాగా, భర్త షమీ ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు నడుపుతున్నాడంటూ ఆరోపణలతో మొదలుపెట్టిన హసీన్‌.. లైంగిక ఆరోపణలు, ఫిక్సింగ్‌, గృహ హింస తదితర కేసులతో షమీకి ఉక్కిరి బిక్కిరి చేశారు. చివరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సైతం కలిసి న్యాయం చేయాలని ఆమె కోరారు. ఆపై కూతురి పోషణ కోసం రూ. 10 లక్షల భరణం ఇప్పించాలంటూ కోల్‌కతా కోర్టులో ఆమె ఓ కేసు దాఖలు చేయగా.. అది విచారణలో ఉంది.
కథువా కేసు; షమీ భార్య షాకింగ్‌ కామెంట్స్‌
ట్విస్ట్‌: తెరపైకి షమీ భార్య మాజీ భర్త!                                        

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement