సికింద్రాబాద్ క్లబ్ గెలుపు | secunderabad club defeted omega baksket ball team | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్ క్లబ్ గెలుపు

Aug 15 2016 11:25 AM | Updated on Sep 4 2017 9:24 AM

హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో సికింద్రాబాద్ క్లబ్ విజయం సాధించింది.

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న క్లబ్  లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో సికింద్రాబాద్ క్లబ్ విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సికింద్రాబాద్ క్లబ్ 44-37తో ఒమెగా బాస్కెట్‌బాల్ క్లబ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సికింద్రాబాద్ తరఫున అమన్ 12 పాయింట్లు, రోహన్ 11 పాయింట్లు సాధించగా... ఒమెగా జట్టు తరఫున అరుణ్ 17 పాయింట్లు, సాయి కుమార్ 12 పాయింట్లతో ఆక ట్టుకున్నారు.

 

ఇతర మ్యాచ్ ల్లో హూప్‌స్టర్స్ క్లబ్ 55-44తో వైఎంసీఏ సికింద్రాబాద్ జట్టును ఓడించింది. హూప్‌స్టర్స్ జట్టు తరఫున వెంకటేశ్ (16), రామకృష్ణా రెడ్డి (21)... వైఎంసీఏ సికింద్రాబాద్ జట్టులో విశాల్ (11), రాజారెడ్డి (10), సోహైల్ ఖాన్ (10) రాణించారు. మరో మ్యాచ్‌లో ఎన్‌పీఏ జట్టు 52- 36తో జింఖానా బాస్కెట్‌బాల్ క్లబ్‌పై గెలుపొందింది. ఎన్‌పీఏ జట్టు తరఫున రాహుల్ (15), భూపేందర్ (11), ప్రశాంత్ (10)... జింఖానా జట్టులో ఆమీర్ (17), రెహమాన్ (10) ప్రతిభ కనబరిచారు.               
 
 22 నుంచి ఇంటర్ స్కూల్ చాంపియన్‌షిప్


 తెలంగాణ స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి 29 వరకు ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ జరుగనుంది. కులీ కుతుబ్ షా స్టేడియంలో పలు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. అండర్ 8, 10, 12, 14, 16 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా పోటీలు జరుగుతాయి. ఇందులో నగరానికి చెందిన అన్ని పాఠశాలలు పాల్గొనవచ్చు. ఆగస్టు 20లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 9700008253 నంబర్‌లో సంప్రదించవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement