ఫైనల్లో సౌరభ్‌ వర్మ 

Saurabh Verma enter to the final - Sakshi

వ్లాదివోస్టాక్‌ (రష్యా): జాతీయ మాజీ చాంపియన్‌ సౌరభ్‌ వర్మ రష్యా ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌ వరల్డ్‌ సూపర్‌–100 టోర్నమెంట్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో అతను 21–9, 21–15తో భారత్‌కే చెందిన మిథున్‌ మంజునాథ్‌పై విజయం సాధించి తుదిపోరుకు చేరాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ కపూర్‌–కుహూ గార్గ్‌ జోడీ కూడా ఫైనల్‌కు అర్హత సాధించింది. సెమీఫైనల్లో రెండో సీడ్‌ రోహన్‌ కపూర్‌–కుహూ గార్గ్‌ జంట 21–19, 11–21, 22–20తో చెన్‌ టాంగ్‌ జై–యెన్‌ వై పెక్‌ (మలేసియా)జోడీపై పోరాడి గెలిచింది.

పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో అరుణ్‌ జార్జ్‌–సన్యమ్‌ శుక్లా జంట 15–21, 19–21తో రెండో సీడ్‌ కాన్‌స్టన్‌టిన్‌ అబ్రమోవ్‌–అలెగ్జెండర్‌ జిన్‌చెన్‌కో (రష్యా) జోడీ చేతిలో ఓడింది. ఫైనల్లో కోకి వటనబే (జపాన్‌)తో సౌరభ్‌ వర్మ; వ్లాదిమిర్‌ ఇవనోవ్‌ (రష్యా)–మిన్‌ యుంగ్‌ కిమ్‌ (కొరియా) ద్వయంతో రోహన్‌ కపూర్‌–కుహూ గార్గ్‌ జోడీ తలపడనుంది.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top