స్నేహితురాలిని పెళ్లాడిన క్రికెటర్‌ | Sanju Samson Married To His College Classmate | Sakshi
Sakshi News home page

స్నేహితురాలిని పెళ్లాడిన టీమిండియా క్రికెటర్‌

Dec 22 2018 4:18 PM | Updated on Dec 23 2018 4:12 AM

Sanju Samson Married To His College Classmate - Sakshi

తిరువనంతపురం : టీమిండియా యువ క్రికెటర్‌ సంజూ శాంసన్‌ తన చిరకాల స్నేహితురాలు చారులతను పెళ్లాడాడు. కోవలంలోని రిసార్టులో శనివారం అత్యంత సన్నిహితుల మధ్య నిరాండబరంగా వీరి వివాహం జరిగింది. గ్రాడ్యుయేషన్‌ చేసే రోజుల్లో సంజూ- చారులతల మధ్య ప్రేమ చిగురించింది. ఈ నేపథ్యంలో పెద్దలను ఒప్పించిన ఈ జంట శనివారం మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సంజూ క్రిస్టియన్‌ మతస్తుడు కాగా, చారులత హిందూ నాయర్‌ కుటుంబానికి చెందిన మహిళ. ఈ క్రమంలో స్పెషల్‌ మ్యారేజ్‌ చట్టం కింద వీరు తమ వివాహాన్ని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా.. ‘ఇరు కుటుంబాలకు చెందిన 30 మంది కుటుంబ సభ్యుల మధ్య మా పెళ్లి నిరాడంబరంగా జరిగింది’ అని సంజూ వ్యాఖ్యానించాడు.

కాగా దేశవాళీ క్రికెట్‌లో రాణించిన కేరళ బ్యాట్స్‌మెన్‌ సంజూను ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాజస్తాన్‌ రాయల్స్‌ టీమ్‌ 2013లో కొనుగోలు చేసింది. ఈ క్రమంలో టీ20ల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో 2015 జూలైలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపికైన టీమిండియా జట్టులో చోటు సంపాదించుకుని అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement