కెప్టన్లుగా రోహిత్ ,పార్థివ్ | Rohit Sharma, Parthiv Patel named as team captains | Sakshi
Sakshi News home page

కెప్టన్లుగా రోహిత్ ,పార్థివ్

Mar 21 2017 11:25 PM | Updated on Sep 5 2017 6:42 AM

కెప్టన్లుగా రోహిత్ ,పార్థివ్

కెప్టన్లుగా రోహిత్ ,పార్థివ్

ఈనెల 25 నుంచి జరిగే దేవ్‌ధర్‌ ట్రోఫీ కోసం ఇండియా ‘బ్లూ’, ఇండియా ‘రెడ్‌’ జట్లను సెలక్టర్లు ఎంపిక చేశారు.

ఇండియా ‘బ్లూ’ కెప్టెన్‌గా రోహిత్‌
‘రెడ్‌’ జట్టు సారథిగా పార్థివ్‌..
దేవ్‌ధర్‌ ట్రోఫీ కోసం జట్ల ప్రకటన


ముంబై: ఈనెల 25 నుంచి జరిగే దేవ్‌ధర్‌ ట్రోఫీ కోసం ఇండియా ‘బ్లూ’, ఇండియా ‘రెడ్‌’ జట్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. భారత బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ ‘బ్లూ’కు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. ‘రెడ్‌’ జట్టుకు పార్థివ్‌ పటేల్‌ నాయకత్వం వహించనున్నాడు. విజయ్‌ హజారే ట్రోఫీ విజేత హోదాలో తమిళనాడు మూడో జట్టుగా బరిలోకి దిగనుంది. ‘బ్లూ’ జట్టులో ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్, అంబటి రాయుడు, శార్దుల్‌ ఠాకూర్‌ చోటు దక్కించుకోగా.. ‘రెడ్‌’ జట్టులో శిఖర్‌ ధావన్, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్, అక్షర్‌ పటేల్, ధావల్‌ కులకర్ణి స్థానం పొందారు.

ఇండియా బ్లూ జట్టు: రోహిత్‌ (కెప్టెన్‌), హర్భజన్, మన్‌దీప్‌ సింగ్, శ్రేయస్‌ అయ్యర్, రాయుడు, మనోజ్‌ తివారీ, రిషబ్‌ పంత్, దీపక్‌ హూడా, క్రునాల్‌ పాండ్య, షాబాజ్‌ నదీమ్, సిద్ధార్థ్‌ కౌల్, శార్దుల్, ప్రసిధ్‌ కృష్ణ, పంకజ్‌ రావు.

ఇండియా రెడ్‌ జట్టు: పార్థివ్‌ (కెప్టెన్‌), ధావన్, మనీశ్, మయాంక్‌ అగర్వాల్, కేదార్‌ జాదవ్, ఇషాంక్‌ జగ్గీ, గుర్‌కీరత్‌ మాన్, అక్షర్, అక్షయ్‌ కర్నేవార్, అశోక్‌ దిండా, కుల్వంత్‌ ఖెజ్రోలియా, ధావల్, గోవిందా పొద్దార్‌. 

Advertisement
 
Advertisement
Advertisement