రోహిత్‌ శర్మ ఔట్‌.. రిజర్వ్‌ ఓపెనర్‌ ఎవరు? | Rohit Ruled Out Of New Zealand ODI And Test series | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మ ఔట్‌.. రిజర్వ్‌ ఓపెనర్‌ ఎవరు?

Feb 3 2020 4:45 PM | Updated on Feb 3 2020 4:51 PM

Rohit Ruled Out Of New Zealand ODI And Test series - Sakshi

మౌంట్‌మాంగని: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్‌ పర్యటన నుంచి రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. కాలిపిక్క కండరాలు పట్టేయడంతో కివీస్‌తో చివరి టీ20కి ఫీల్డ్‌లోకి రాని రోహిత్‌ శర్మ మొత్తం ద్వైపాక్షిక సిరీస్‌ నుంచే వైదొలిగాడు. రోహిత్‌ శర్మకు కండరాలు పట్టేసిన తర్వాత బీసీసీఐ పరిశీలనలో ఉంచారు. కాగా, రోహిత్‌ మిగతా వన్డే, టెస్టు సిరీస్‌లకు అందుబాటులో ఉండటం లేదనే విషయం బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ‘ న్యూజిలాండ్‌ పర్యటన నుంచి రోహిత్‌ ఔటయ్యాడు. ప్రస్తుతం రోహిత్‌ పూర్తి ఫిట్‌గా లేడు. ఫిజియో సూచన మేరకు రోహిత్‌కు విశ్రాంతి అవసరం’ బీసీసీఐలోని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.(ఇక్కడ చదవండి; అందుకే ధోని బెస్ట్‌ కెప్టెన్‌: రోహిత్‌)

అయితే న్యూజిలాండ్‌ పర్యటన నుంచి రోహిత్‌ శర్మ ఔట్‌ కావడంతో వన్డే ఫార్మాట్‌లో రిజర్వ్‌ ఓపెనర్‌గా ఎవర్ని తీసుకురావాలనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.  ఈ రేసులో మయాంక్‌ అగర్వాల్‌తో పాటు శుబ్‌మన్‌ గిల్‌లు ముందంజలో ఉన్నారు. వన్డే సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌కు జతగా పృథ్వీషా ఓపెనర్‌గా దిగడం  ఖాయం. శిఖర్‌ ధావన్‌ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కావడంతో పృథ్వీ షాకు అవకాశం దక్కింది. ఇప్పుడు రోహిత్‌కు గాయంతో రిజర్వ్‌ ఓపెనర్‌గా అగర్వాల్, గిల్‌ల్లో ఎవరు అనేది మేనేజ్‌మెంట్‌ తేల్చాల్సి ఉంది. వీరిద్దరూ వన్డే సిరీస్‌కు ఎంపిక కాకపోయినా, ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనలోనే ఉన్నారు. భారత్‌-ఎ జట్టు తరఫున ఆడుతుండటంతో వీరిలో ఒకరి చాన్స్‌ దక్కే అవకాశం ఉంది. ఇక్కడ గిల్‌కే తొలి ప్రాధాన్యత ఇవ్వొచ్చు.  న్యూజిలాండ్‌ ’ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో గిల్‌ అజేయంగా డబుల్‌ సెంచరీ సాధించాడు. దాంతో రోహిత్‌ స్థానంలో గిల్‌ను తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.(ఇక్కడ చదవండి: శుబ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement