శభాష్‌ రహానే.. | Rahane Ends Three Year Home Drought With Century | Sakshi
Sakshi News home page

శభాష్‌ రహానే..

Oct 20 2019 10:28 AM | Updated on Oct 20 2019 2:07 PM

Rahane Ends Three Year Home Drought With Century - Sakshi

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే సైతంసెంచరీ బాదేశాడు. 169 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో సెంచరీ మార్కును చేరాడు. ఇది రహానేకు 11వ టెస్టు సెంచరీ. నిన్నటి ఆటలో హాఫ్‌ సెంచరీ సాధించిన రహానే.. ఈరోజు ఓవర్‌నైట్‌ ఆటగాడిగా దిగిన శతకాన్ని నమోదు చేశాడు. 224/3 ఓవర్‌నైట్‌తో స్కోరు ఆదివారం రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా నిలకడగా బ్యాటింగ్‌ చేస్తోంది.

ఓవర్‌నైట్‌ ఆటగాళ్లు రోహిత్‌-రహానేలు చక్కటి సమన్వయంతో స్కోరు బోర్డును ముందుకు తీసుకెళుతున్నారు. ఒకవైపు రోహిత్‌ ధాటిగానే బ్యాటింగ్‌ చేస్తుండగా, రహానే మాత్రం కుదురుగా ఆడుతున్నాడు. శనివారం ప్రారంభమైన చివరిదైన మూడో టెస్టులో రోహిత్‌ ఇప్పటికే సెంచరీ సాధించగా, తాజాగా రహానే కూడా సెంచరీ సాధించడంతో భారత్‌ పట్టు బిగించింది.  ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సెంచరీ సాధించి సుదీర్ఘ విరామానికి చెక్‌ పెట్టిన రహానే.. స్వదేశంలో మూడేళ్ల తర్వాత శతంక సాధించాడు. ఈ జోడి 230 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని సాధించి సఫారీలకు పరీక్షగా నిలిచింది. ఇదిలా ఉంచితే రోహిత్‌ శర్మ 150 పరుగుల మార్కును చేరుకున్నాడు.  199 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్సర్లతో 150 పరుగులు సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement