పైకా జాతీయ క్రీడలు ప్రారంభం | pica sports national start | Sakshi
Sakshi News home page

పైకా జాతీయ క్రీడలు ప్రారంభం

Jan 8 2014 1:21 AM | Updated on Sep 2 2017 2:22 AM

పాలమూరు జిల్లా తొలిసారిగా అండర్-16 పైకా జాతీయ క్రీడలకు వేదిక అయింది. జిల్లా స్టేడియంలో మంగళవారం సాయంత్రం క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు.

మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, న్యూస్‌లైన్: పాలమూరు జిల్లా తొలిసారిగా అండర్-16 పైకా జాతీయ క్రీడలకు వేదిక అయింది. జిల్లా స్టేడియంలో మంగళవారం సాయంత్రం క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రీడలు ఈనెల 10వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ క్రీడల్లో అథ్లెటిక్స్, వాలీబాల్, తైక్వాండో విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీకి 18 రాష్ట్రాల నుంచి 1400 మంది క్రీడాకారులు హాజరయ్యారు.
 
 ఈ క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో బాల, బాలికలకు 100 మీ, 400 మీ, 800 మీ, 1500 మీ, 3వేల మీటర్ల పరుగుతోపాటు లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌ఫుట్, డిస్కస్‌త్రో, 4ఁ100 మీటర్ల రిలే, 4ఁ400మీటర్ల రిలే పోటీలు నిర్వహిస్తారు. తైక్వాండోలో బాలురకు 48 కిలోల విభాగంతోపాటు, 51, 55, 59, 63, 68, 73, 73 కిలోలపైబడి విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. బాలికలకు 44 కిలోలు, 47, 51, 55, 55కిలోలపైబడి విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement