విజేత రోస్‌బర్గ్ | Nico Rosberg wins after Lewis Hamilton collision | Sakshi
Sakshi News home page

విజేత రోస్‌బర్గ్

Apr 4 2016 3:05 AM | Updated on Sep 3 2017 9:08 PM

విజేత రోస్‌బర్గ్

విజేత రోస్‌బర్గ్

బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టుకు చెందిన నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు.

సాఖిర్: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టుకు చెందిన నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన రేసులో రోస్‌బర్గ్ 57 ల్యాప్‌లను గంటా 33 నిమిషాల 34.696 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలోనూ రోస్‌బర్గ్‌కు టైటిల్ లభించింది.

‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ (మెర్సిడెస్) తొలి ల్యాప్‌లోనే వెనుకబడిపోయాడు. చివరికి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కిమీ రైకోనెన్ (ఫెరారీ)కు రెండో స్థానం లభించింది. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు టాప్-10లో నిలువలేకపోయారు. హుల్కెన్‌బర్గ్ 15వ, పెరెజ్ 16వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. సీజన్‌లోని తదుపరి రేసు చైనా గ్రాండ్‌ప్రి ఈనెల 17న జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement