టీమిండియాకు షాక్‌; తొలి వన్డేలో ఓటమి

Newzeland Won The MAtch Against India In 1st Odi - Sakshi

హామిల్టన్‌ : న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియాకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఐదు టీ20 ల సిరీస్‌ను 5-0 తేడాతో గెలిచి అదరగొట్టిన టీమిండియా పరిమిత ఓవర్ల ఆటలో మాత్రం కివీస్‌కు తలవంచింది. హామిల్టన్‌ వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌ టీమిండియాపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.కొంతకాలంగా తన ఆటతీరుతో విమర్శలపాలవుతున్న కివీస్‌ సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ రాస్‌ టేలర్‌ తన అద్వితీయ బ్యాటింగ్‌తో చివరివరకు నిలిచి జట్టును గెలిపించాడు. టీమిండియా విధించిన 348 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని కివీస్‌ జట్టు మరో 11 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. కివీస్‌ బ్యాట్స్‌మెన్లలో రాస్‌ టేలర్‌ శతకంతో చెలరేగగా, టామ్‌ లాథమ్‌, హెన్రీ నికోలస్‌లు అర్థసెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 2 వికెట్లు, శార్దూల్‌ ఠాకూర్‌ 1 వికెట్‌ తీశాడు. టీమిండియా బౌలర్లలో ఒక్క బుమ్రా తప్ప మిగతవారంతా ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడం విశేషం. (కోహ్లి ‘వీక్‌’ పాయింట్‌ అదేనా?)

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ తన వన్డే కెరీర్‌లో తొలి సెంచరీతో మెరవగా, కేఎల్‌ రాహుల్‌ మెరుపు అర్థశతకాన్ని సాధించగా, టీమిండియా కెప్టెన్‌ కోహ్లి అర్థశతకంతో రాణించాడు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌధీ 2 వెకెట్లు, కొలిన్‌ డి ఇంగ్రామ్‌, ఇష్‌ సోదీ చెరో వికెట్‌ తీశారు. ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియాకు కోల్పోయిన కివీస్‌ పరిమిత ఓవర్ల ఆటలో   భారీ లక్ష్యాన్ని తడబడకుండా చేధించడం విశేషం. కాగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం(ఫిబ్రవరి 7) ఆక్లాండ్‌ వేదికగా జరగనుంది. (శ్రేయస్‌ అయ్యర్‌ శతక్కొట్టుడు​​​​​​​)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top