ఫైనల్లో నందగోపాల్‌ జంట | nanda gopal pair in final of malaysia open badminton | Sakshi
Sakshi News home page

ఫైనల్లో నందగోపాల్‌ జంట

Jul 16 2017 10:47 AM | Updated on Sep 5 2017 4:10 PM

మలేసియా ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ కిడాంబి నందగోపాల్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

సాక్షి, హైదరాబాద్‌: మలేసియా ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ కిడాంబి నందగోపాల్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కౌలాలంపూర్‌లో శనివారం జరిగిన సెమీఫైనల్లో నందగోపాల్‌–మహిమా అగర్వాల్‌ (భారత్‌) ద్వయం 21–13, 21–17తో జెన్‌ టింగ్‌ లిమ్‌–కా మున్‌ చిన్‌ (మలేసియా) జోడీపై విజయం సాధించింది.

 

కేవలం 28 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జంటకు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. ఆదివారం జరిగే ఫైనల్లో టాప్‌ సీడ్‌ యాంతోని సపుత్ర–మార్షెల్లా (ఇండోనేసియా) జోడీతో నందగోపాల్‌–మహిమా ద్వయం తలపడుతుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement