శ్రీశాంత్‌ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం

Massive Fire Breaks Out At Sreesanth Residense - Sakshi

కొచ్చి:  భారత క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున కొచ్చిలోని శ్రీశాంత్‌ నివాసంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కలకలం రేగింది. తొలుత గ్రౌండ్‌ ఫ్లోర్‌ వ్యాపించిన మంటలు.. బెడ్‌ రూమ్‌ వరకూ వ్యాపించాయి. ఈ ఘటనలో బెడ్‌ రూమ్‌ పూర్తిగా దగ్థమైనట్లు తెలుస్తోంది.  కాగా, ఈ ఘటనలో ఎవరకూ గాయపడలేదు.  శ్రీశాంత్‌ భార్యా పిల్లలు సురక్షితంగా బయటకు వచ్చారు. స్థానికుల సాయంతో అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటీనా అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. శ్రీశాంత్‌ భార్యా పిల్లలు ఫస్ట్‌ ఫ్లోర్‌ చిక్కుకుపోవడంతో గ్లాస్‌ను బద్దలు కొట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆ సమయంలో శ్రీశాంత్‌ ఇంట్లో లేడు. షార్ట్‌  సర్క్యూట్‌  కారణంగానే  అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం.

కొన్ని రోజుల క్రితం శ్రీశాంత్‌పై ఉన్న జీవిత కాల నిషేధాన్ని బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే ఏడేళ్లకు కుదించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలుప ఇప్పటికే ఆరేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న శ్రీశాంత్‌ ఇంకా ఏడాది పాటు నిషేధం ఎదుర్కోనున్నాడు.  ఈ క్రమంలోనే డీకే జైన్‌ ఎదుట హాజరైన శ్రీశాంత్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో తన కెరీర్‌ నాశనమైందని మొరపెట్టుకున్నాడు. భారత​ టెస్టు జట్టులోకి పునరాగమనం చేయడమే తన అంతిమ లక్ష్యమని, తన కెరీర్‌ ముగిసే సరికి కనీనం వంద వికెట్లు తీయాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

సంబంధిత వార్తలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top