కేరళ 238/6 | Kerala 238/6 | Sakshi
Sakshi News home page

కేరళ 238/6

Dec 17 2014 12:38 AM | Updated on Sep 4 2018 5:07 PM

కేరళ 238/6 - Sakshi

కేరళ 238/6

ఒకరిద్దరు మినహా.. మిగతా బ్యాట్స్‌మెన్ తడబడటంతో హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో గోవా జట్టు ఎదురీదుతోంది.

సాక్షి, హైదరాబాద్: ఒకరిద్దరు మినహా.. మిగతా బ్యాట్స్‌మెన్ తడబడటంతో హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో గోవా జట్టు ఎదురీదుతోంది. మూడో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి గోవా తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 238 పరుగులు సాధించింది. షగుణ్ కామత్ (215 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో 97) మూడు పరుగుల తేడాలో సెంచరీని చేజార్చుకున్నాడు.
 
 కీనన్ వాజ్ (101 బంతుల్లో 7 ఫోర్లతో 45), మిసాల్ (97 బంతుల్లో 6 ఫోర్లతో 36) ఫర్వాలేదనిపించారు. హైదరాబాద్ జట్టు బౌలర్లలో రవి కిరణ్ (2/24), ప్రజ్ఞాన్ ఓజా (2/98) రెండేసి వికెట్లు తీసుకోగా... మిలింద్ (1/56) ఒక వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం గోవా 330 పరుగులు వెనుకబడి ఉంది. ఆటకు బుధవారం చివరిరోజు. అంతకుముందు హైదరాబాద్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను ఓవర్‌నైట్ స్కోరు 568/7 వద్దే డిక్లేర్ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement