‘పంత్‌ను అలా చూడాలనుకుంటున్నా’ | Irfan Pathan Suggests New Role For Rishabh Pant | Sakshi
Sakshi News home page

‘పంత్‌ను అలా చూడాలనుకుంటున్నా’

Jan 24 2020 12:42 PM | Updated on Jan 24 2020 12:44 PM

Irfan Pathan Suggests New Role For Rishabh Pant - Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టులో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ వచ్చిన యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో గాయపడటంతోఅతని స్థానంలో కేఎల్‌ రాహుల్‌ కీపర్‌గా సమర్ధవంతమైన పాత్రను నిర్వహించాడు. దాంతో పంత్‌ మూడో వన్డే నాటికి సిద్ధమైనా రాహుల్‌నే కొనసాగించారు. ఇక న్యూజిలాండ్‌తో తొలి టీ20లో కూడా తుది జట్టులో పంత్‌కు అవకాశం దక్కలేదు. అయితే టీమిండియా మేనేజ్‌మెంట్‌ వరుస అవకాశాలు ఇవ్వడంపై మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ స్పందించాడు. పంత్‌ను మంచి మ్యాచ్‌ ఫినిషర్‌గా భావించే అన్ని అవకాశాలు ఇచ్చారన్నాడు. వాటిని వినియోగించుకోవడంలో మాత్రం పంత్‌ విఫలమయ్యాడని పేర్కొన్నాడు.

‘పంత్‌ కచ్చితంగా ఫినిషర్‌ పాత్రను పోషించాలి. అందుకోసమే టీమిండియా అన్వేషణ సాగుతోంది. ఆ క్రమంలోనే పంత్‌కు అవకాశాలు ఇచ్చుకుంటూ పోయింది. పంత్‌పై చాలా నమ్మకం ఉంచింది కాబట్టే అన్ని అవకాశాలు దక్కాయి. కానీ అంతర్జాతీయ స్థాయిలో పంత్‌ తన ఫినిషింగ్‌ స్కిల్స్‌ను ప్రదర్శించలేకపోయాడు. ఐపీఎల్‌లో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతూ మంచి ఫినిషింగ్‌లు ఇచ్చాడు. ఒకవేళ భవిష్యత్తులో పంత్‌ అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి ఫినిషర్‌గా ఎదగవచ్చు. కాకపోతే అతనిపై నమ్మకం ఉంచుకోవడం ముఖ్యం. మంచి ఫినిషర్‌గా పంత్‌ను చూడాలనుకుంటున్నా’ అని ఇర్ఫాన్‌ తెలిపాడు. (ఇక్కడ చదవండిరిషభ్‌ పరిస్థితి ఏమిటి?)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement