సీఎస్‌కే మరోసారి ‘చాంపియన్‌’ ఆట..

IPL 2019 CSK Beat Rajasthan Royals By  4 Wickets - Sakshi

జైపూర్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి చాంపియన్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. గురువారం స్థానిక సవాయ్‌ మాన్‌సింగ్‌ మైదానంలో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సొంతమైదానంలో గెలిచి పునర్వైభవం అందుకోవాలనుకున్న రాజస్తాన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. రాజస్తాన్‌ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే.. 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సీఎస్‌కే టాపార్డర్‌ పూర్తిగా విఫలమైనా రాయుడు(57), ధోని(58)లు బాధ్యాతయుతంగా ఆడారు. ఇక రాజస్తాన్‌ బౌలర్లలో స్టోక్స్‌ రెండు వికెట్లు తీయగా.. కులకర్ణి, ఉనద్కత్‌, ఆర్చర్‌లు తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

రాయుడు-ధోని సూపర్‌ ఇన్నింగ్స్‌
ఛేదనలో సీఎస్‌కేకు ఆదిలోనే షాక్‌ తగిలింది. వాట్సన్‌(0), రైనా(4)లు వెంటవెంటనే వెనుదిరిగారు. అనంతరం డుప్లెసిస్‌(7), జాదవ్‌(1)లు కూడా తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ధోని-రాయుడు బాధ్యాతాయుతంగా ఆడారు. మొదట మరో వికెట్‌ పడకుండా నెమ్మదిగా ఆడారు. అనంతరం గేర్‌ మార్చి పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్దసెంచరీలు పూర్తి చేశారు. స్కోర్‌ పెంచే క్రమంలో రాయుడు భారీ షాట్‌కు యత్నించి క్యాచ్‌ అవుటయ్యాడు. 

నాటకీయంగా చివరి ఓవర్‌
చివరి ఓవర్‌లో సీఎస్‌కే విజయానికి 18 పరుగులు కావాల్సి ఉంది. స్టోక్స్‌ వేసిన ఈ ఓవర్‌లో తొలి బంతిని జడేజా సిక్సర్‌ కొట్టాడు. రెండో బంతికి సింగిల్‌ తీయగా అది నోబాల్‌ కావడంతో ఫ్రీ హిట్‌ రూపంలో సీఎస్‌కేకు మరో అవకాశం వచ్చింది. తర్వాత బంతికి ధోని రెండు పరుగులు రాబట్టాడు. మూడో బంతికి ధోనిని స్టోక్స్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో సీఎస్‌కే శిబిరం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అయితే క్రీజులోకి వచ్చిన సాంట్నర్‌ చాలా తెలివిగా ఆడాడు. నాలుగు, ఐదు బంతులకు రెండు పరుగుల చొప్పున చేశాడు. అయితే స్టోక్స్‌ వేసిన ఐదో బంతి తొలుత నోబాల్‌గా ప్రకటించిన అంపైర్‌ ఆతర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దీంతో కాసేపు మైదానంలో సీఎస్‌కే ఆటగాళ్లకు, అంపైర్ల మధ్య వాగ్వాదం జరిగింది. చివరి బంతికి సీఎస్‌కే విజయానికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా సాంటర్న్‌ సిక్సర్‌ కొట్టి జట్టుకు విజయాన్నందించాడు. 

స్వల్పస్కోర్‌కే పరిమితమైన రాజస్తాన్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన రాజస్తాన్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్‌ అజింక్యా రహానే(14) నిరాశపరిచాడు. దీపక్‌ చాహర్‌ వేసిన మూడో ఓవర్‌లో రహానే ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. అటు తర్వాత జోస్‌ బట్లర్‌(23) కాసేపు మెరుపులు మెరిపించినప్పటికీ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. రాజస్తాన్‌ స్కోరు 47 పరుగుల వద్ద ఉండగా బట్లర్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు.

ఆపై సంజూ శాంసన్‌(6), రాహుల్‌ త‍్రిపాఠి(10), స్మిత్‌(15)లు సైతం విఫలమయ్యారు. కాగా, బెన్‌ స్టోక్స్‌(28) ఫర్వాలేదనిపించడంతో రాజస్తాన్‌ తేరుకుంది. చివర్లో రియాన్‌ పరాగ్‌(16), జోఫ్రా ఆర్చర్‌(13 నాటౌట్‌), శ్రేయస్‌ గోపాల్‌(19)లు బ్యాట్‌ ఝుళిపించడంతో రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, రవీంద్ర జడేజాలు తలో రెండు వికెట్లు సాధించగా, మిచెల్‌ సాంట్నర్‌కు వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు

28-04-2019
Apr 28, 2019, 01:03 IST
‘ప్లే ఆఫ్‌’ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ అదరగొట్టింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయంతో రేసులోకి...
27-04-2019
Apr 27, 2019, 21:49 IST
జైపూర్‌: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కవ శనివారం సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 161...
27-04-2019
Apr 27, 2019, 19:51 IST
జైపూర్‌: ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా స్థానిక సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో...
27-04-2019
Apr 27, 2019, 17:14 IST
సిడ్నీ: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఎక్కువ చర్చనీయాంశమైన అంశాల్లో ఒకటి కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ అశ్విన్‌ చేసిన మన్కడింగ్‌ కాగా,...
27-04-2019
Apr 27, 2019, 10:39 IST
ధోని రిటైర్‌ అయితే చెన్నై జట్టును రద్దు చేసుకోవడం బెటర్‌..
27-04-2019
Apr 27, 2019, 10:06 IST
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరిన్ని రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు
27-04-2019
Apr 27, 2019, 09:43 IST
ముంబై : మమ్మల్నే బ్లాక్‌ మెయిల్‌ చేస్తారా? అంటూ క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)పై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి( బీసీసీఐ) ఆగ్రహం...
27-04-2019
Apr 27, 2019, 08:54 IST
ఓ ఎమ్మెస్కే ప్రసాద్‌.. రాయుడు కూడా 3D ఆటగాడే ఏమంటావ్‌?
27-04-2019
Apr 27, 2019, 07:14 IST
సాక్షి, హైదరాబాద్‌: మ్యాచ్‌ మ్యాచ్‌కు ప్లే ఆఫ్స్‌ సమీకరణాలు మారనున్న తరుణంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు కొత్త...
27-04-2019
Apr 27, 2019, 00:43 IST
డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సొంతగడ్డపై తొలి పరాజయాన్ని చవిచూసింది. ముందు ఆశించినన్ని పరుగులు...
26-04-2019
Apr 26, 2019, 21:49 IST
చెన్నై: ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 156  పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌...
26-04-2019
Apr 26, 2019, 19:50 IST
చెన్నై: ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా స్థానిక చెపాక్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడుతోంది.   ఈ మ్యాచ్‌లో...
26-04-2019
Apr 26, 2019, 18:24 IST
ఢిల్లీ: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ నుంచి తాను ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నానని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌...
26-04-2019
Apr 26, 2019, 16:32 IST
చెన్నై: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి విశ్రాంతి ఇస్తే అది జట్టుపై తీవ్ర...
26-04-2019
Apr 26, 2019, 09:07 IST
క్రికెట్‌ చరిత్రలోనే ఎన్నడూ.. కనివిని ఎరుగని ఈ వింత హాస్యాస్పదక ఘటన
26-04-2019
Apr 26, 2019, 07:13 IST
గతేడాది అద్భుత ప్రస్థానంతో దర్జాగా ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌... ఈసారి అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఎదుర్కొంటోంది....
26-04-2019
Apr 26, 2019, 01:45 IST
ప్లే ఆఫ్స్‌ రేసు ముంగిట... అది కూడా సొంతగడ్డపై... కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు పెద్ద షాక్‌. రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఆ...
25-04-2019
Apr 25, 2019, 21:58 IST
కోల్‌కతా: ఐపీఎల్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 176 పరుగుల టార్గెట్‌ నిర్దేశించింది. దినేశ్‌ కార్తీక్‌(97...
25-04-2019
Apr 25, 2019, 19:48 IST
కోల్‌కతా: ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా స్థానిక ఈడెన్‌ గార్డెన్‌ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాజస్తాన్‌​ రాయల్స్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో...
25-04-2019
Apr 25, 2019, 18:14 IST
బెంగళూరు: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ భుజం...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top