మన బజరంగ్‌... ప్రపంచ నంబర్‌వన్‌

Indian star wrestler Bajrangi Poonia has achieved another rare feat. - Sakshi

భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా మరో అరుదైన ఘనత సాధించాడు. ఇటీవలే ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ రెజ్లర్‌గా గుర్తింపు పొందిన అతను తాజాగా యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ ర్యాంకింగ్స్‌ 65 కేజీల విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అధిరోహించాడు. గతంలో ఏ భారతీయ రెజ్లర్‌ కూడా నంబర్‌వన్‌ ర్యాంక్‌ సాధించలేదు. హరియాణాకు చెందిన 24 ఏళ్ల బజరంగ్‌ 96 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు. తోబియర్‌ (క్యూబా–66 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో... చకయెవ్‌ (రష్యా–62 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో ఉన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top