మూడో టి20 రద్దు

సూరత్: భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన మూడో టి20 మ్యాచ్ వర్షార్పణమైంది. ఎడతెరిపిలేని వర్షాలతో ఇక్కడి మైదానం తడిసి ముద్దయింది. దీంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. 7.30 గంటలకు పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు మ్యాచ్ నిర్వహణ అసాధ్యమని తేల్చారు. సిరీస్‌లో వరుసగా రద్దయిన రెండో మ్యాచ్ ఇది. గురువారం రెండో టి20 మ్యాచ్ కూడా వర్షం వల్ల జరగలేదు. ఐదు మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌లో తొలి టి20 గెలిచిన భారత మహిళల జట్టు 1–0తో ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్ కూడా ఇక్కడే మంగళవారం జరుగుతుంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి