జోరులో భారత్‌, పట్టుదలగా ఇంగ్లండ్‌ | Sakshi
Sakshi News home page

జోరులో భారత్‌, పట్టుదలగా ఇంగ్లండ్‌

Published Sun, Jan 15 2017 8:37 AM

జోరులో భారత్‌, పట్టుదలగా ఇంగ్లండ్‌

పుణె: భారత, ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పుణేలో ఈరోజు తొలి మ్యాచ్‌ జరగనుంది. విరాట్‌ కోహ్లి పూర్తి స్థాయి వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆడుతున్న తొలి సిరీస్‌ ఇదే కావడం విశేషం. టెస్టుల్లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్‌.... వన్డేల్లోనూ అదే జోరును ప్రదర్శించాలని భావిస్తోంది.

మరోవైపు పరిమితి ఓవర్ల స్పెషలిస్ట్‌ ఆటగాళ్లతో భారత్‌కు వచ్చిన ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ ఫలితం పునరావృతం కారాదని పట్టుదలగా ఉంది. దాదాపు పదేళ్ల తర్వాత మరో కెప్టెన్‌ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న ధోనితో పాటు పునరాగమనం చేసిన యువరాజ్‌పై ప్రధానంగా అందరి దృష్టి నిలిచింది. జేసన్‌ రాయ్, హేల్స్, బట్లర్‌లాంటి హిట్టర్లతో ఇంగ్లండ్‌ కూడా మెరుగ్గా కనిపిస్తోంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement