2016లో విండీస్ పర్యటన | India to tour Caribbean in 2016, ending West Indies impasse | Sakshi
Sakshi News home page

2016లో విండీస్ పర్యటన

Dec 25 2015 12:36 AM | Updated on Sep 3 2017 2:31 PM

ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో భారత్, వెస్టిండీస్‌ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభణకు ఎట్టకేలకు గురువారం తెరపడింది.

నాలుగు టెస్టుల సిరీస్ ఆడనున్న భారత్
 సెయింట్ జాన్స్ (అంటిగ్వా):
ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో భారత్, వెస్టిండీస్‌ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభణకు ఎట్టకేలకు గురువారం తెరపడింది. విండీస్‌తో సిరీస్‌ను పునరుద్ధరించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే ఏడాది జూలై-ఆగస్టులో కరీబియన్ జట్టుతో నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ మేరకు విండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) నుంచి ఓ ప్రకటన వచ్చింది.
 
  ‘బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌తో జరిపిన చర్చలు ఫలించాయి. 2016లో విండీస్‌లో సిరీస్ ఆడేందుకు భారత్ అంగీకరించింది. ఈ ఒప్పందానికి మా బోర్డుతో పాటు ప్లేయర్స్ అసోసియేషన్ కట్టుబడి ఉంది. గతేడాది అర్ధంతరంగా టూర్ ముగిసింది. కాబట్టి ఇప్పుడు మరో సిరీస్ నిర్వహణ కోసం సిద్ధంగా ఉన్నాం’ అని డబ్ల్యూఐసీబీ అధ్యక్షుడు డేవ్ కామోరాన్ తెలిపారు. అయితే కామోరాన్ ఎక్కువ చొరవ చూపడంతో మనోహర్ హామీ ఇవ్వాల్సి వచ్చిందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement