డబుల్ ట్రాప్‌లో భారత్‌కు కాంస్యం | In the double trap bronze to India | Sakshi
Sakshi News home page

డబుల్ ట్రాప్‌లో భారత్‌కు కాంస్యం

Sep 15 2015 12:02 AM | Updated on Sep 3 2017 9:24 AM

ప్రపంచ షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో భారత్‌కు టీమ్ విభాగంలో కాంస్య పతకం

న్యూఢిల్లీ: ప్రపంచ షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో భారత్‌కు టీమ్ విభాగంలో కాంస్య పతకం లభించింది. ఇటలీలోని లొనాటా నగరంలో సోమవారం జరిగిన ఈ పోటీల్లో మొహమ్మద్ అసబ్, అంకుర్ మిట్టర్, సంగ్రామ్ దహియాలతో కూడిన భారత బృందం 400 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానాన్ని దక్కించుకుంది.

బ్రిటన్ (414 పాయింట్లు), రష్యా (406 పాయింట్లు) జట్లు స్వర్ణ, రజత పతకాలు సాధించాయి. వ్యక్తిగత విభాగంలో అసబ్ 12వ, అంకుర్ 16వ, సంగ్రామ్ 23వ స్థానాల్లో నిలిచారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement