breaking news
Double Trap event
-
ఏషియన్ గేమ్స్: 15 ఏళ్ల ‘సిల్వర్’ విహాన్
జకర్తా: ఇండోనేషియాలో జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. ముఖ్యంగా షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. గురువారం పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్లో 15 ఏళ్ల యువ సంచలనం శార్దూల్ విహాన్ రజత పతకం సాధించాడు. దీంతో నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, పది కాంస్య పతకాలు సాధించిన భారత్.. మొత్తం 17 పతకాలతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. 50 మీటర్ల బట్టర్ఫ్లై (స్విమ్మింగ్) విభాగంలో విర్ద్వాల్ ఖడే ఫైనల్‌కు అర్హత సాధించాడు. అతడు 24.09 సెకన్లలోనే ఫీట్‌ను పూర్తి చేసి జాతీయ రికార్డును నెలకోల్పాడు మరోవైపు ఆర్చరీలో తీవ్ర నిరాశే ఎదురైంది. ఎన్నో అంచనాల మధ్య ఆసియా క్రీడల బరిలోకి దిగిన దీపికా కుమారి ప్రీక్వార్టర్స్ ఫైనల్స్‌లోనే వెనుదిరిగారు. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో చియాంగ్ యంగ్ లి (చైనీస్ తైపీ) చేతిలో 3-7 చేతిలో ఓటమి చవిచూశారు. -
డబుల్ ట్రాప్‌లో భారత్‌కు కాంస్యం
న్యూఢిల్లీ: ప్రపంచ షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్లో భారత్‌కు టీమ్ విభాగంలో కాంస్య పతకం లభించింది. ఇటలీలోని లొనాటా నగరంలో సోమవారం జరిగిన ఈ పోటీల్లో మొహమ్మద్ అసబ్, అంకుర్ మిట్టర్, సంగ్రామ్ దహియాలతో కూడిన భారత బృందం 400 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానాన్ని దక్కించుకుంది. బ్రిటన్ (414 పాయింట్లు), రష్యా (406 పాయింట్లు) జట్లు స్వర్ణ, రజత పతకాలు సాధించాయి. వ్యక్తిగత విభాగంలో అసబ్ 12వ, అంకుర్ 16వ, సంగ్రామ్ 23వ స్థానాల్లో నిలిచారు. -
డబుల్ ట్రాప్ చాంపియన్ విఖార్
రాష్ట్రస్థాయి షూటింగ్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థాయి తొలి షూటింగ్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్లో విఖార్ అహ్మద్ షఫీఖ్ స్వర్ణం గెలుచుకున్నాడు. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ అథారిటీ షూటింగ్ రేంజ్లో ఈ నెల 13 నుంచి జరుగుతున్న ఈ పోటీలు సోమవారం ముగిశాయి. డబుల్ ట్రాప్‌లో విఖార్ అహ్మద్ 32 పాయింట్లు సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, ఎం.డి.విక్రమ్ 31 పాయింట్లతో రజతం దక్కించుకున్నాడు. పురుషుల ‘స్కీట్’ విభాగంలో అమిత్ సంఘీ 67 పాయింట్లతో స్వర్ణం, చేతన్‌రెడ్డి 64 పాయింట్లతో రజతం, విఖార్ అహ్మద్ 63 పాయింట్లతో కాంస్యం గెలుచుకున్నారు. పురుషుల ‘స్కీట్’ జూనియర్ విభాగంలో ఆయుష్ రాజు 63 పాయింట్లు సాధించి స్వర్ణం నెగ్గాడు. పురుషుల స్టాండర్డ్ రైఫిల్ ప్రోన్‌లో సలీమ్ మూసా (235 పాయింట్లు), స్మాల్ బోర్ ఫ్రీ రైఫిల్‌లో తాహెర్ ఖాద్రి (288), జూనియర్ విభాగంలో సర్దార్ అలీ బైయిజ్ (268)లు పసిడి పతకాలు గెలుపొందారు. మహిళల ఫ్రీ రైఫిల్ ప్రోన్‌లో సువర్ణ (279), పురుషుల 3 పి ఫ్రీ రైఫిల్ విభాగంలో తాహెర్ ఖాద్రి (254), జూనియర్ విభాగంలో సాయి అభినవ్, ఫ్రీ పిస్టల్‌లో ప్రసన్న కుమార్ (250)లు విజేతలుగా నిలిచారు. ఇక పురుషుల సెంటర్ ఫైర్ పిస్టల్‌లో స్వర్ణం నెగ్గిన ఆగా జైనులబ్దీన్ (277), జూనియర్ విభాగంలోనూ విజేతగా నిలిచాడు. మహిళల స్పోర్ట్స్ పిస్టల్‌లో సబా ఫాతిమా (259) జూనియర్, సీనియర్ విభాగాల్లో పసిడి సాధించింది. ఆంధ్రప్రదేశ్ పోటీల విజేతలు వీరే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 15వ షూటింగ్ చాంపియన్‌షిప్ మహిళల ఎయిర్ రైఫిల్ పోటీల్లో టి.అమ్మాజీ 378 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. పురుషుల ఎయిర్ పిస్టల్‌లో మల్లిఖార్జునరావు (363), మహిళల ఎయిర్ పిస్టల్‌లో సిరి శాఖమూరు (339), పురుషుల ఫ్రీ రైఫిల్ 3 పి ఫ్రీ రైఫిల్‌లో ఖాదర్ బాబు (253) స్వర్ణాలు గెలుచుకున్నారు. ఇక పురుషుల ‘స్కీట్’ విభాగంలో వంశీ చక్రవర్తి (49), స్మాల్ బోర్ ఫ్రీ రైఫిల్‌లో ఖాదర్ బాబు (283), పురుషుల ఎయిర్ రైఫిల్ సబ్ జూనియర్స్‌లో భార్గవ్ వర్మ (367)లు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు.