కోట్లాలో సెమీస్ మ్యాచ్ అనుమానమే! | ICC World Twenty20: Feroz Shah Kotla likely to retain first semifinal | Sakshi
Sakshi News home page

కోట్లాలో సెమీస్ మ్యాచ్ అనుమానమే!

Mar 22 2016 12:22 AM | Updated on Sep 3 2017 8:16 PM

టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగేది అనుమానంగా మారింది.

న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగేది అనుమానంగా మారింది. స్టేడియంలో 1800 సీట్ల సామర్థ్యం ఉన్న ఆర్‌పీ మెహ్రా బ్లాక్‌కు సంబంధించిన టిక్కెట్లను ఇంకా అమ్మలేదు. దీనికోసం ఐసీసీ ఆదివారం వరకే గడువునిచ్చింది. ఆ బ్లాక్‌కు సంబంధించి సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ బెంగళూరుకు తరలితే డీడీసీఏ రూ.4 కోట్లు నష్టపోతుంది. ‘ఇప్పటిదాకా అయితే వేదిక మార్పు గురించి ఐసీసీ, బీసీసీఐ నుంచి మాకు సమాచారం లేదు’ అని ఢిల్లీ క్రికెట్ సంఘం  అధికారి అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement